Thursday, December 19, 2024

సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ కమిషనర్‌గా స్మిత్

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమీ స్మిత్‌కు కీలక పదవి లభించింది. త్వరలో ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా స్మిత్‌ను నియమించారు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సీజన్ నుంచి ఐపిఎల్ తరహాలో టి20 లీగ్‌ను నిర్వహించనుంది. ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. మరోవైపు సౌతాఫ్రికా లీగ్‌లో ఉన్న ఆరు ఫ్రాంచైజీలను కూడా భారత్‌కు చెందిన వారే కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం ఐపిఎల్‌లో ఉన్న పలు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా లీగ్‌లోని జట్లను సొంతం చేసుకున్నాయి. కేప్‌టౌన్, జోహెన్నస్‌బర్గ్, పోర్ట్ ఎలిజబెత్, ప్రిటోరియా, డర్బన్, పార్ల్ పేర్లతో ఆరు జట్లను భారత ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్, సిఎస్‌కె, లక్నో, సన్‌రైజర్స్, ఢిల్లీ, రాజస్థాన్ జట్ల యాజమాన్యాలు సౌతాఫ్రికా లీగ్ జట్లను దక్కించుకున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్‌కు స్మిత్ కమిషనర్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా స్మిత్‌కు పేరుంది. అంతేగాక అతను విజయవంతమైన కెప్టెన్‌గా కూడా గుర్తింపు పొందాడు. దీంతో స్మిత్‌ను కీలకమైన బాధ్యతలు అప్పగించాలని సౌతాఫ్రికా క్రికెట్ నిర్ణయించింది. ఇక కీలకమైన పదవి లభించడంపై స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవిని విజయవంతంగా నిర్వహించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని స్మిత్ పేర్కొన్నాడు.

Smith appointed as Commissioner of Cricket SA League

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News