Thursday, January 23, 2025

స్మిత్ శతకం

- Advertisement -
- Advertisement -

ఆసీస్ భారీ స్కోరు
యాషెస్ రెండో టెస్టు

లార్డ్: ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ స్మిత్ సెంచరీ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(77), డేవిడ్ వార్నర్ (66) అర్ధ శతకాలు సాధించారు. మార్నస్ లబుషేన్(47) ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాష్ టంగ్, ఒల్లీ రాబిన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. జో రూట్ కు రెండు వికెట్లు దక్కాయి. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 339 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (22), మిచెల్ స్టార్క్ (6) వెంట వెంటనే అవుటయ్యారు.

అయితే కెప్టెన్ కమిన్స్ (22 నాటౌట్)తో కలిసి స్మిత్ ఆస్ట్రేలియాను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో వీరిద్దరు వేగంగా ఆడారు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫోర్ బాదిన స్మిత్ టెస్టు కెరీర్ లో 32వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా (32 సెంచరీలు) సరసన నిలిచాడు. సెంచరీ చేసిన తర్వాత స్మిత్ అవుటయ్యాడు. అయితే కమిన్స్ పోరాడటంతో ఆస్ట్రేలియా 400 మార్కును దాటగలిగింది. కాగా, ఆస్ట్రేలియా తన చివరి ఐదు వికెట్లను 100 పరుగుల తేడాతో కోల్పోయింది.

స్మిత్‌కు 32వ సెంచరీ..

ఈ టెస్టులో 184 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. టెస్ట్ కెరీర్‌లో స్మిత్‌కు ఇది 32వ సెంచరీ కాగా.. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా(32) సరసన నిలిచాడు. అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా.. జాక్వస్ కల్లీస్(45), రికీ పాంటింగ్(41) స్మిత్ కన్నా ముందున్నారు. ఈ తరం క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News