Monday, December 23, 2024

సిబిఐకి ఏడుగురు కొత్త డిఐజీల్లో సుమేథ, గగన్ దీప్ సింగ్లా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సిబిఐకి గురువారం నియామకమైన ఏడుగురు కొత్త డిఐజి( డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్)ల్లో సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు సుమేథ, గగన్‌దీప్‌లకు అవకాశం లభించింది. సుమేథ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ కాగా, సింగ్లా రాజస్థాన్ క్యాడర్ 2010 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్.

వీరిద్దరూ జనవరి 12 నుంచి 2029 జనవరి 11 వరకు దాదాపు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సింగ్లా గత ఏడాది నవంబర్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సిబిఐలో నియామకమయ్యారు. వీరిద్దరితోపాటు కె. శివ సుబ్రమణి, ధురత్ సాయాలి సవ్లారం, పి. మురుగన్, రాజ్‌వీర్, జల్‌సింగ్ మీనా డిఐజిలుగా నియామకమయ్యారు. ఈ ఐదుగురు ప్రస్తుతం సిబిఐలో ఎస్‌పిలుగా పనిచేస్తున్నారు. వీరు పదవీకాలాలు వేర్వేరుగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News