Monday, December 23, 2024

ప్రజలకు మంచి సేవలు అందిస్తే మనసుకు సంతృప్తినిస్తుంది: స్మిత సబర్వాల్

- Advertisement -
- Advertisement -

ప్రజలకు మంచి సేవలు అందిస్తే మనసుకు సంతృప్తినిస్తుందని మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. సోమవారం రాఘవపూర్ నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మించిన శిక్షణ కేంద్ర భవనాన్ని మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మలతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రెండు రోజులు నిర్వహించిన మిషన్ భగీరథ సహాయకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణ పొందిన మిషన్ భగీరథ సహాయకులు చేయాల్సిన పనులు, శిక్షణలో పొందిన అనుభూతులపై వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్మిత సబర్వాల్ మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి కోటికి పైన కుటుంబాలకు రక్షిత మంచి నీరును అందించడం జరుగుతుందన్నారు. ఏదొక జన్మలో చేసిన పుణ్యమో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించి గౌరవం పెంచుకోవాలని ఆమె సూచించారు. మిషన్ భగీరథ నీటి ద్వారా కలిగే ప్రయోజనాలను శిక్షణ పొందిన సహాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా పైపుల లీకేజీలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు.

గ్రామాల్లో ప్రభుత్వ సర్వీసుల మేరకు అనుభవమున్న వీఆర్ఏలు మిషన్ భగీరథలో ఉద్యోగం పొందిన మీరు ఇంకా మెరుగైన సేవలందించవచ్చని ఆమె అన్నారు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులకు మిషన్ భగీరథలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రజలకు అందించడంలో ప్రజా ప్రతినిధుల సహకారం అవసరమని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News