Sunday, December 22, 2024

ఎసి బోగీలో పొగలు.. స్టేషన్‌లో ఆగిపోయిన రైలు

- Advertisement -
- Advertisement -

నూభువనేశ్వర్: ఎయిర్ కండీషనింగ్ యూనిట్‌లోనుంచి పొగలు వెలువడుతుండడాన్ని చూసి ఎసి బోగీలోని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ నుంచి అగర్తల వెలుథున్న ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు.

రైల్వే సిబ్బంది వెంటనే పొగను ఆపేసినప్పటికీ మరో విద్యుత్ ప్రమాదం సంభవిస్తుందన్న భయంతో ప్రయాణికులు అదే బోగీలో ప్రయాణించడానికి నిరాకరించారు. వేరే బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.

బి 5(ఎసి 3 టైర్) బోగీలో మొదట ఎసి యూనిట్ నుంచి పొగలు రావడం చూసిన కొందరు ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. చాలా మంది ప్రయాణికులు బోగీలోనుంచి కిందకు దిగిపోయి మళ్లీ రైలు ఎక్కడానికి నిరాకరించినట్లు ఒక రైల్వే అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News