Tuesday, December 3, 2024

హైదరాబాద్‌ నడిబొడ్డున భూమిలో నుంచి పొగలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో కెబిఆర్ పార్కు వద్ద భూమిలో నుంచి పొగలు వచ్చాయి. భూమిలో నుంచి పొగలు ఎలా వస్తున్నాయని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వింత ఘటన చూసేందుకు వాహనదారులు గుమిగూడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  పొగలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే దానిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది 11కెవి కేబుల్‌ను అమర్చినట్టు స్థానికులు చెబుతున్నారు. కేబుల్ డ్యామేజీ కావడంతో పొగలు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. అండర్ గ్రౌండ్‌లో కరెంట్ వైర్లలో షార్ట్ సర్య్కూట్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News