Friday, December 27, 2024

ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు

- Advertisement -
- Advertisement -

రైలు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాము. కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ రైలు ప్రమాదంలో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఆదివారం జనగామ జిల్లాలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు వ్యాపించాయి. ఆగి ఉన్న గూడ్స్ రైల్లో ప్రమాదవశాత్తు ఓ బోగీలో ఉన్న బొగ్గు లోపలి నుండి పొగలు వచ్చాయి.

ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలుసుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. దాంతో ఫైర్ ఇంజన్ సాయంతో పొగలను అదుపు చేశారు. అయితే రైల్వే విద్యుత్ లైన్ ఉండడంతో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తేనే పొగలను అదుపులోకి తెచ్చేందుకు వీలు అవుతుందని చెప్పడంతో అధికారులు విద్యుత్తును కొంతసేపు ఆపివేశారు. దీంతో ఆ లైన్లో వెళ్తున్న పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News