Wednesday, January 22, 2025

చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ రైలులో పొగలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ రైలులో గురువారం చక్రాల నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు వెల్లూరులోని గుడియాట్టం రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన ప్రయాణీకులు చక్రాల నుండి పొగలు రావడాన్ని వెంటనే గమనించి, రైలును నిలిపివేసారు. దక్షిణ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రైలులోని కోచ్ సిక్స్ (సి-6) చక్రాల కింద నుంచి పొగలు రావడాన్ని కొంతమంది ప్రయాణికులు ప్రత్యేకంగా గమనించారు. బ్రేకింగ్ సిస్టమ్ వేడెక్కడం వల్ల పొగ వచ్చిందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News