Monday, December 23, 2024

చెన్నై ఎగ్మోర్‌ రైలులో మంటలు.. గద్వాల స్టేషన్‌లో నిలిపివేత

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల ప్రతినిధి: గద్వాల రైల్వేస్టేషన్‌లో చెన్నై ఎగ్మోర్‌ రైలును ఆదివారం అధికారులు అకస్మాతుగా నిలిపివేశారు. ట్రైన్ నంబర్ 17653 నంబర్ గల చెన్నై‌ ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో నుంచి దట్టంగా పొగలు వ్యాపించడంతో రైల్వే అధికారులు వెంటనే రైలును ఆపారు. అనంతరం ప్రయాణికులను దింపివేశారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… కాచిగూడ నుంచి చెన్నైకి వెళ్తున్న ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎనిమిదో నెంబర్‌ ఎసి బోగీలో పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. ఆ తర్వాత అధికారులు ప్రయాణికులను బోగీల నుంచి కిందకు దింపారు. రైలులో పొగలు రావడానికి కారణాలు ఆరాతీశారు. ఎసి బోగీ వద్ద మరమ్మతులు చేశారు. ప్రతి ఎసి కోచ్ వద్ద కింది భాగంలో ఉండే బ్యాటరీ బెల్టు వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. అధికారులు మరమ్మతులు చేయడంతో రైలు గద్వాల నుంచి చెన్నైకి యధావిదిగా వెళ్లడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Smoke in Chennai Egmore Express

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News