Monday, December 23, 2024

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం పొగలు రావడంతో రైలును కొంచెంసేపు నిలిపివేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్య రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు చైన్ లాగారు. రైల్వే కోపైలట్, సిబ్బంది ఎసి బోగీ వద్దకు చేరుకొని… బ్రేకులు పట్టేయడంతోనే పొగలు వచ్చాయని, చక్రాల నుంచి మంటలు వ్యాపించకముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు మరమ్మతులు చేసిన అనంతరం రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది.

Also read: చంద్రయాన్ -3 ల్యాండింగ్ సమయంలో పుట్టిన పిల్లలకు చంద్రయాన్ పేర్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News