Monday, December 23, 2024

స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు

- Advertisement -
- Advertisement -

Smoke in Spicejet flight at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విమానాన్ని పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. విమానంలో పొగతో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా స్పైస్‌జెట్‌ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News