Monday, December 23, 2024

ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్

- Advertisement -
- Advertisement -

Smoking increases cancer deaths : The Lancet

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి కాన్యర్ మరణానికి దోహదమవుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగం ఈ కారణాల వల్లనే చోటు చేసుకుంటున్నాయని ది లాన్సెట్ జర్నలో వెలువడిన నివేదిక వెల్లడించింది. ప్రపంచంపై వ్యాధులు, గాయాలు, ప్రమాద కారకాల భారం ఫలితాలపై నిర్వహించిన అధ్యయన నివేదికను ది ల్యాన్సెట్ జర్నల్ ప్రచురించింది. అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. పైన పేర్కొన్న కారణాల వల్లనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 44.5లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్ మరణాల్లో దాదాపు 44.4 శాతం ఈ మూడు కారణాల వల్లే చనిపోతున్నారని వెల్లడించారు. 2019లో దాదాపు 28.8 లక్షల మంది క్యాన్సర్ బాధిత పురుషులు ఈ ప్రమాదకరమైన అలవాట్ల వల్లే ప్రాణాలు కోల్పోయారు. మహిళా బాధితులతో పోలిస్తే ఇవి దాదాపు మూడింతలు ఎక్కువ. ప్రధానంగా శ్వాసకోశ క్యాన్సర్ బాధితుల్లోనే ఈ మరణాలు అధికంగా ఉన్నాయి. ఈ మరణాలకు ప్రధాన కారణం ధూమపానమే. దాదాపు 36.9 శాతం బాధితులు ఈ ఒక్క ప్రమాదపు అలవాటు వల్లనే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులతోపాటు విధాన కర్తలకు ఈ అధ్యయనం ఎంతగానో దోహద పడుతుందని డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News