కమల్‌హాసన్‌కు స్మృతి ఇరానీ సవాల్
కోయంబత్తూర్: తమిళనాడు సమస్యలపై బిజెపి అభ్యర్థితో చర్చించాలంటూ మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్న వనతి శ్రీనివాసన్‌తో చర్చలో పాల్గొనాలని కమల్‌కు ఇరానీ సవాల్ విసిరారు. అదే నియోజకవర్గం నుంచి కమల్‌హాసన్ పోటీ చేస్తున్నారు. ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో కేంద్రంపై కమల్‌హాసన్ చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఇరానీ ఈ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల మరుగు దొడ్లను నిర్మించిందని, అందులో 90 లక్షలు తమిళనాడులోనని ఇరానీ తెలిపారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా 40 కోట్లమంది పేదవారి ఖాతాల్లో కేంద్రం డబ్బులు వేస్తోందని ఆమె అన్నారు. తమిళనాడులో మిగతా పార్టీలను వదిలి కమల్‌పైనే విమర్శలు ఎందుకని ఓ విలేకరి ప్రశ్నించగా, కాంగ్రెస్‌లాంటి పార్టీలు సీన్‌లో లేవని ఆమె అన్నారు.