Monday, January 20, 2025

రాజస్థాన్ లో నిరాడంబరంగా స్మృతి ఇరాని కుమార్తె వివాహం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు స్మృతి ఇని కుమార్తె షానెల్లె వివాహం గురువారం రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లాలో అర్జున్ భల్లాతో జరిగింది. ప్రస్తుతం హెరిటేజ్ హోటల్‌గా మారిన 15వ శతాబ్దానికి చెందిన ఖిమ్సర్ కోటలో షానెల్లె వివాహం రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు, మిత్రుల సమక్షంలో జరిగినట్లు వర్గాలు తెలిపాయి. హల్దీ, మెహెందీ వేడుకలు బుధవారం జరిగినట్లు వారు చెప్పారు. స్మృతి ఇరాని, ఆమె భర్త జుబిన్ ఇరాని, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గజేంద్ర సింగ్, వదువు తరఫున కొందరు బుంధువులు, మొత్తం సుమారు రెండువైపులా 50 మంది మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News