Friday, April 4, 2025

కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు : స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ ఇద్దరు మహిళల అర్ధనగ్న ఊరేగింపు సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌తో తాను నేరుగా మాట్లాడానని, దీనిపై దర్యాప్తు సాగుతోందని, బాధితులకు న్యాయం చేకూరే వరకు నేరస్థులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించడం అమానవీయమైన చర్య అని, ఇది తప్పనిసరిగా ఖండించదగినదని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మణిపూర్ ఏ రాష్ట్రమైనా మహిళల భద్రతకు, రక్షణకు , గౌరవానికి అంకితమయ్యేలా పనిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ అభ్యర్ధించారని మరో ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News