Thursday, January 23, 2025

స్నేహితురాలి భర్తతో పెళ్లి.. కీలక ప్రశ్నపై స్మృతీ ఇరానీ ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏదైనా అడగండి కానీ… జుబిన్ ఇరానీతో తన పెళ్లి గురించి అడగొద్దు అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. ప్రశ్నవేసిన వారిపై మండిపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ (ఎఎంఎ ముచ్చట్ల దశలో ఆమె స్పందించారు. మీరు మీ స్నేహితురాలు మోనా భర్తతో జరిగిందా? అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి జవాబిస్తూ ఆన్‌లైన్‌లో తనకు ఇటువంటి ప్రశ్నే ఎదురవుతూ వస్తోందని, జుబిన్‌తో తన పెళ్లి, మోనాతో తన వ్యక్తిగత స్నేహం విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు.

అయినా మోనాను ఈ వివాదంలోకి లాగవద్దని, ఆమె తన చిన్ననాటి స్నేహితురాలేమి కాదని, తన కన్నా 13 ఏండ్లు పెద్ద అని తెలిపారు. తనపై రాజకీయ దాడికి దిగండి కానీ ఆమెను వివాదంలోకి లాగకండని స్పష్టం చేశారు. ఆమెను గౌరవించాల్సి ఉందన్నారు. ఒకప్పుడు నటి అయిన స్మృతీ 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. కుమారుడు జోహ్, కూతురు జోయిష్ ఉన్నారు. కాగా అంతకు ముందే జుబిన్‌కు మోనాతో పెళ్లయింది.

వీరికి కూతురు షనేలి ఉంది. తరువాత వీరు వీరు విడిపొయ్యారు. ఇక సినిమా, టీవీ జీవితం పోగొట్టుకున్నానని ఫీల్ అవుతున్నారా? అనే ప్రశ్నకు జవాబిస్తూ రీల్ లైఫ్‌లో ఉన్నప్పుడు అదో రంగుల కల అన్పించిందని, అయితే కాలమే కొత్త పాతల మధ్య సరైన వారధిగా మారుతుందన్నారు. కాలం గాయం చేయడమే కాకుండా గాయాన్ని నయం కూడా చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News