Monday, January 20, 2025

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బిఆర్‌ఎస్‌కే ఓటేసినట్లే: స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బిఆర్‌ఎస్‌కి ఓటేసినట్టే అన్నారు. కెసిఆర్, రాహుల్ గాంధీ తెలంగాణ గల్లీల్లో కొట్లాడుతారన్నారు. ఢిల్లీలో కలిసి అలయ్ బలయ్ చేసుకుని చీకటి ఒప్పందాలు చేసుకుంటారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డగోలుగా వ్యయం పెంచి పూర్తి చేశారన్నారు. నియామకాల విషయంలో తెలంగాణ యువతకి అన్యాయం చేసి తన కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని తెలిపారు. టెక్స్ టైల్ పార్క్ ఇస్తామని కెసిఆర్ ఇవ్వలేదని, ప్రధాని మోడీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో బిఆర్‌ఎస్ హస్తం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. బగావో కెసిఆర్.. జితావో బిజెపి అన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా రూపొందించడంలో ఎందుకు విఫలమయ్యారని ముఖ్యమంత్రిని ఆమె ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బిజెపి నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News