Monday, March 31, 2025

పరాజయాలకు నాదే బాధ్యత: స్మృతి మంధాన

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల ఐపిఎల్‌లో వరుస ఓటములు తనను ఎంతో బాధకు గురి చేశాయని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఆవేదన వ్యక్తం చేసింది. జట్టు ఓటములకు తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేసింది. అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నా వరుస ఓటములు ఎదురు కావడం బాధగా ఉందని చెప్పింది.

ఈ సీజన్‌లో ఆర్‌సిబి ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తిగా లేదని తెలిపింది. జట్టును ముందుండి నడిపించడంలో తాను పూర్తిగా విఫలమయ్యానని మంధాన అభిప్రాయపడింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడడం ఏ జట్టుకైనా చాలా అవమానకర అంశం అనడంలో సందేహం లేదని అభిప్రాయపడింది. యూపి వారియర్స్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని మంధాన వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News