Tuesday, December 24, 2024

మంధానకు నాలుగో ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గతంతో పోల్చితే మంధాన మరో 25 పాయింట్లను పెంచుకుంది. దీంతో మంధాన టాప్3లో నిలిచేందుకు మరింత చేరువైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో మంధాన చిన్మరణీయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంధాన 728 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 3 స్థానాలు మెరుగుపరుచుకుని 9వ ర్యాంక్‌కు చేరుకుంది.

కివీస్‌తో జరిగిన చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ అర్ధ సెంచరీ సాధించింది. మరోవైపు లారా వాల్వార్డ్‌ట్ 756 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. నాట్ స్కివెర్ బ్రంట్ రెండో, చమరి ఆటపట్టు మూడో ర్యాంక్‌ను దక్కించుకుంది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News