Sunday, December 22, 2024

మంధానకు రెండో ర్యాంక్

- Advertisement -
- Advertisement -

Smriti Mandhana climbs no 2 in ICC T20 Ranking

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం ప్రకటించిన మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. మంధాన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. మంధాన 731 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రాణించడంతో మంధాన ర్యాంక్ మెరుగైంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ 743 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) మూడో, సోఫి డివైన్ (కివీస్) నాలుగో, తహిలా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక భారత్‌కు చెందిన యువ ఓపెనర్ షఫాలీ వర్మ ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. కాగా, బౌలింగ్ విభాగంలో సోఫి ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. భారత బౌలర్ దీప్తి శర్మ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. మరోవైపు వన్డేల్లోనూ మంధాన మూడు స్థానాలను మెరుగుపరుచుకుని ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వన్డేల్లో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది.

Smriti Mandhana climbs no 2 in ICC T20 Ranking

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News