Sunday, January 19, 2025

డబ్య్లూపిఎల్ వేలం.. జాక్ పాట్ కొట్టేసిన స్మృతి మంధాన‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) వేలంలో భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన‌కు భారీ ధ‌ర ద‌క్కింది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఈ స్టార్ ప్లేయ‌ర్ వేలంలో క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికింది. రూ. 3.40 కోట్ల‌కు ఈ స్టార్ క్రికెట‌ర్‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. రూ. 50 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర ఉన్న మంధాన‌ను కొనుగోలు చేసేందుకు ఐదు జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు ఆర్‌సిబి భారీ ధ‌ర‌కు ఈమెను ద‌క్కించుకుంది.

బీసీసీఐ తొలిసారిగా నిర్వ‌హిస్తున్న డ‌బ్ల్యూపీఎల్ వేలం ముంబై వేదిక‌గా జ‌రుగుతోంది. మొత్తం 409మంది క్రికెట‌ర్లు వేలంలో ఉన్నారు. ఐదు ఫ్రాంఛైజీలు 90 మందిని కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతున్నాయి. మార్చి 4న ముంబై వేదిక‌గా డ‌బ్ల్యూపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చిలోనే డబ్ల్యూపిఎల్ తొలి సీజన్ ప్రారంభించనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. డబ్ల్యూపిఎల్ మహిళా క్రికెట్ అభివృద్ధికి దోహదపడనుందని బోర్డు తెలిపింది. మార్చిలో ప్రారంభమయ్యే డబ్ల్యూపిఎల్ వచ్చే నెల 26వరకు జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News