Friday, November 22, 2024

స్మృతి మంధన రికార్డు స్కోరు!

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన మహిళా క్రికెటర్ గా…

కరార(క్వీన్స్‌ల్యాండ్): భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై భేషుగ్గా ఆడేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధన అయితే ఆస్ట్రేలియా జట్టుపై అత్యధికి స్కోరు సాధించిన భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. పింక్ బాల్ టెస్(డే అండ్ నైట్)లో శతకాన్ని నమోదు చేసిన తొటి భారతీయ మహిళా  క్రికెటర్ గా రికార్డు సాధించింది. రెండో రోజు ఆట సమయానికి భారత్ 231/3తో పురోగమనంలో ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై భారతీయ మహిళా క్రికెటర్ కు ఇదే తొలి శతకం.
స్మృతి మంధన 216 బంతుల్లో 127 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఆ స్కోరులో 22 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. రెండో వికెట్ (పూనమ్ రౌత్-36) పతనం సమయానికి భారత్ ఆస్ట్రేలియాపై 102 పరుగుల ఆధిక్యతతో ఉంది. తొలి రోజున షఫాలీ వర్మ 93 పరుగులతో శుభారంభం చేసినప్పటికీ వాన వల్ల ఆట ఆగిపోయింది.

స్కోరు సంక్షిప్తంగా: భారత్ తొలి ఇన్నింగ్స్: 231/3(84 ఓవర్లలో).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News