Thursday, January 9, 2025

ఐసిసి ఉత్తమ క్రికెటర్‌గా మంధాన

- Advertisement -
- Advertisement -

Smriti Mandhana named ICC Cricketer of the Year

ఐసిసి పురస్కారాల్లో పాక్ క్రికెటర్ల హవా

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా నడిచింది. ఇక మహిళల విభాగంలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకుంది. 2021 సంవత్సరానికి గాను ఐసిసి అవార్డులను ప్రకటించింది. ఇక మహిళల విభాగంలో మంధాన, పురుషుల విభాగంలో షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు. మరోవైపు ఐసిసి మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దక్కించుకున్నాడు. వన్డే విభాగంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. పురుషుల ట్వంటీ20 విభాగంలో మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) ఉత్తమ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో టామీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్) ప్లేయర్ ఆఫ్‌ది ట్వంటీ20గా నిలిచింది. ఐసిసి ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సనా ఫాతిమా (పాకిస్థాన్) సొంతం చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News