Sunday, December 22, 2024

ఐపిఎల్‌తో మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు: స్మృతి మంధాన

- Advertisement -
- Advertisement -

ముంబై: పురుషుల క్రికెట్‌కు సమానంగా మహిళలకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. ఐపిఎల్‌తో మహిళా క్రికెట్‌లో కొత్త ఊపు రావడం ఖాయమని జోస్యం చెప్పింది.

బిసిసిఐ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే సువర్ణ అవకాశం దక్కుతుందని వివరించింది. కాగా మంగళవారం వాణిజ్య సంబంధ కార్యక్రమంలో పాల్గొన్న మంధాన కొద్ది సేపు మీడియాతో ముచ్చటించింది. కాగా, స్మృతి మంధాన హర్బల్‌లైఫ్ న్యూట్రిషిన్ ఇండియా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News