Monday, December 23, 2024

వరల్డ్‌కప్‌కు మంధాన ఫిట్

- Advertisement -
- Advertisement -

Smriti Mandhana named ICC Cricketer of the Year

 

ఓవల్: వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద ఊరట లభించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వరల్డ్‌కప్‌లో పాల్గొనే విషయంలో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా మంధాన తీవ్రంగా గాయపడింది. సఫారీ బౌలర్ వేసిన ఓ బంతి తలకు బలంగా తాకడంతో మంధాన మైదానాన్ని అర్ధాంతరంగా వీడాల్సి వచ్చింది.

దీంతో మంధాన వరల్డ్‌కప్‌లో పాల్గొంటుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. జట్టులో అత్యంత కీలకమైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న మంధాన దూరమైతే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు వరల్డ్‌కప్‌లో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అయితే హెచ్చరించారు. అయితే సోమవారం మంధానకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రంగా లేదని తేలడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. మంధాన వరల్డ్‌కప్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడొచ్చని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంలో నెలకొన్న ఆందోళనకు పుల్‌స్టాప్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News