Sunday, December 22, 2024

ఎర్ర చందనం తరలిస్తున్న వాహనం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: పుష్ప సినిమా తరహాలో ఎంతో చాకచక్యంగా ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్నారు. ఒక డిసిఎంలో ఎర్ర చందనం దుంగలను ఉంచి, అవి కనిపించకుండా వాటిపై కొబ్బరి బొండాలు నింపి, తరలిస్తున్న వాహనాన్ని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డిసిఎం వ్యాన్‌లో 50 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుండి నాగాపూర్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు. డిసిఎం వ్యాన్ ఉత్తరప్రదేశ్‌కి చెందినదిగా గుర్తించారు. ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న కర్నూలుకు చెందిన ప్రతాప్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరిప్రకాష్, ఢిల్లీకి చెందిన సత్య బాహులను అదుపులోకి తీసుకొన్నారు. ఎర్ర చందనంతోపాటు డిసిఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News