Sunday, December 22, 2024

బంగ్లాదేశ్ సరిహద్దులో బంగారు బిస్కెట్లతో స్మగ్లర్లు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్, డిఆర్ఐ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 106 బంగారు బిస్కెట్లతో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు. పట్టుబడిన బంగారం బరువు 14.296 కిలోలు అని, భారత మార్కెట్‌లో దీని విలువ రూ.8.50 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చారు. ఇంట్లోని చెత్త కుప్పలో రెండు గుడ్డ సంచులలో బంగారు బిస్కెట్లను దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా, బీఎస్ఎఫ్ 32వ కార్ప్స్, డిఆర్ఐ బృందం శనివారం సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని బోర్డర్ అవుట్‌పోస్ట్ విజయ్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంటి నుండి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సరిహద్దు ప్రాంతంలోని విజయ్‌పూర్ గ్రామంలో ఒకరి ఇంట్లో బంగారం దాచి ఉంచినట్లు డీఆర్‌ఐకి పక్కా సమాచారం అందిందని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News