Monday, December 23, 2024

బంగారం కోసం వారిని దుబాయ్‌కు పంపుతున్న స్మగ్లింగ్ ముఠా

- Advertisement -
- Advertisement -

Rs 5 Crore Worth Gold Seized at Kurnool

 

సికింద్రాబాద్: హైదరాబాద్ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమందిని ఎంపిక చేసుకొని దుబాయ్‌కు పంపుతోంది. పర్యాటక వీసాతో కొందరిని స్మగ్లింగ్ ముఠా దుబాయ్‌కు పంపుతోంది. దుబాయ్ చూడాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు స్మగ్లర్లు గాలం వేస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ కోసం ముఠాలు సొంత ఖర్చులతో దుబాయ్‌కు పంపిస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అక్రమ బంగారాన్ని తీసుకవస్తున్నారు. బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకరావాల్సిందిగా చెబుతున్నాయి. పట్టుబడకుండా హైదరాబాద్‌కు బంగారం తీసుకవస్తేనే డబ్బులు ఇస్తున్నారు.

ఇటీవల సనత్ నగర్ నుంచి ముగ్గురిని దుబాయ్‌కి పంపించారు. షెహబాజ్, అయాజ్, ఫహద్‌లను 15 రోజుల క్రితం దుబాయ్‌కు పంపారు. అక్రమ బంగారాన్ని షెహబాజ్, అయాజ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తిరిగిరాకుండా దుబాయ్‌లోని పహజ్ తప్పించుకున్నారు. ఫహద్ ఆచూకీ కోసం అతడి తండ్రిని స్మగ్లర్లు కిడ్నాప్ చేశారు. బంగారం స్మగ్లింగ్ ముఠా షెహబాజ్, అయాజ్, అసిమ్‌ను కిడ్నాప్ చేశారు. శాస్త్రిపురంలోని ఓ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్మగ్లింగ్ ముఠా దందా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలియగానే స్మగ్లింగ్ ముఠాను నలుగురిని వదిలిపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News