Sunday, February 2, 2025

పామును కొరికి చంపిన బాలుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. మద్నాపూర్ గ్రామంలో దినేశ్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. దినేశ్ సింగ్‌కు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తన నాయనమ్మ కలిసి ఉంటున్నాడు. శనివారం బాలుడు ఆరుబయట ఆడుకుంటుండగా పాము అతడి దగ్గరికి పాము వచ్చింది. పాము మెడపట్టుకొని కొరికి చంపాడు. కొరికి చంపుతుండగా పాము బాలుడిని కరిచింది. వెంటనే బాలుడిని, పాముని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో తన మనవడు ఇలా ఎప్పుడ ప్రవర్తించలేదని తెలిపాడు.

Also Read: పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News