- Advertisement -
కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గురుకులం పాఠశాలలో విద్యార్థిని పాము కాటుకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలోని మీని గురుకుల పాఠశాలలో నాలుగవ తరగతి చుదువుతున్న విద్యార్థిని నిఖిత బుధవారం రాత్రి వరండాలో కూర్చుని ఉంది.
ఆ సమయంలో ఎటునుంచి వచ్చిందో కాని నిఖిత కుడి కాలు బోటన వేలుపై కాటు వేసింది. వెంటనే అప్రమ్తమైన ప్రిన్సిపల్ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాముల పట్టేవారిని పిలిపించి పాము కోసం గాలించారు. పామును గుర్తించి చంపుతుండగా మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో రెండు పాములను స్థానికులు చంపేయగా మరో రెండు పాములు తప్పించుకున్నాయి. ప్రస్థుతం నిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఒకేసారి ఇన్ని పాములు కనింపించడంతో విద్యార్థినిలు భయపడుతున్నారు.
- Advertisement -