Thursday, January 23, 2025

పాముకాటుతో వ్యక్తి మృతి… బతికి వస్తాడని 30 గంటల పాటు పూజలు

- Advertisement -
- Advertisement -

Snake bite man in UP

లక్నో: పాము కాటుతో చనిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని ఓ కుటుంబ 30 గంటలు పాటు పూజలు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మెయిన్ పురి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాటవాన్ మొహలా గ్రామంలో తాలీబ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తాలీబ్‌కు పాము కరవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాలీబ్ చనిపోయాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తరువాత తన కుమారుడిని బతికించుకోవాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు మంత్రగాళ్లు, తాంత్రికుల సహాయంతో 30 గంటల పాటు పూజలు చేయడంతో పాటు పాములను పట్టే వారిని కూడా తీసుకొచ్చారు. ఎన్ని పూజలు చేసి తాలీబ్‌లో స్పృహలోకి రాకపోవడంతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News