Sunday, January 19, 2025

తల్లిని కరిచిన పాము.. సిినిమాలో చూసి కాపాడిన కూతురు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తల్లి పాము కాటు వేయడంతో ఆమె ప్రాణపాయ స్థితిలో ఉండగా కూతురు ఆమె ప్రాణాలను కాపాడిన సంఘటన కర్నాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా కెయ్యూరు ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎట్కెడ్య గ్రామంలో మమత తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. మమత ఇంటి దగ్గర ఉండి ఇంటి పనులను చేస్తుంది. ఇంటి పెరంట్లో పిచ్చి మొక్కలు పెరగడంతో వాటిని తొలగిస్తుండగా మమతను పాము కరిచింది. పాము కరిచింది కేకలు వేసి స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే కూతురు శ్రమ్యరాయ్ తల్లి దగ్గరకు వెళ్లింది. పాము కరించిందని చెప్పగానే కరిచిన చోట గట్టిగా రక్తాన్ని తనో నోటితో పిలిచి బయటకు ఉమ్మేసింది. స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలను కుమార్తె కాపాడిందని వైద్యులు ప్రశంసించారు. ఓ సినిమాలో పాము కరిచినప్పుడు కరిచిన చోట నోటీతో రక్తాన్ని పీల్చడం తాను చూశానని అదే పని ఇప్పుడు చేశానని శ్రమ్య తెలిపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి అత్యంత దైర్యవంతురాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News