Saturday, December 21, 2024

పాఠశాలలో విద్యార్థిని కాటేసిన పాము… పాము విషాన్ని నోటితో లాగేసిన ఉపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

భీంపూర్: ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థిని పాము కాటేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా దనోర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం….. మామిడి యశ్వంత్ అనే విద్యార్థి దనోర పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం వరండాలో కూర్చున్న యశ్వంత్ ను పాము కాటేయడంతో వెంటనే ఉపాధ్యాయుడు గుమ్మడి సురేశ్‌కు సదరు విద్యార్థి తెలిపాడు. కాటేసిన భాగాన్ని సురేశ్ నోటితో విషాన్ని లాగాడు అనంతరం తన బైక్‌పై బాలుడిని తీసుకొని భీంపూర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు లేకపోవడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్ రాకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. విద్యార్థిని వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాటేసిన పాము విషపుదా? కాదా? అనే తెలుసుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. రక్త పరీక్ష చేసి ల్యాబ్‌కు పంపామని వైద్యులు వివరించారు. చికిత్స అందించకపోవడంతోపై భీంపూర్ ఆరోగ్య కేంద్రం వైద్యుడిని నిఖిల్ రాజ్ సంప్రదించగా వివరణ ఇచ్చాడు. గిరిగామ్ ఉపకేంద్రం సందర్శనలో ఉన్నానని, అంబులెన్స్ మరో చోటకు వెళ్లిందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News