పాట్నా: వంటింట్లో భార్య పని చేస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. దీంతో పామును డబ్బాలో వేసుకొని భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన బీహార్ రాష్ట్రం సబౌర్ ప్రాంతంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. జుర్ ఖురియా గ్రామంలో నిషా- రాహుల్ అనే దంపతులు నివసిస్తున్నారు. నిషా ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. భార్య భయంతో కేకలు వేయడంతో భర్త ఆమె వద్ద పరుగులు తీశాడు. పాము కరిచిందని చెప్పి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. దేవుడి ఫొటోల వెనుకకు వెళ్లిన పామును పట్టుకొని డబ్బులో వేసుకున్నాడు. బైక్ పై భార్య కూర్చోపెట్టుకొని డబ్బాను హ్యాండిల్ కు తగిలించుకొని ఆస్పత్రికి వెళ్లాడు. డబ్బాలో ఉన్న పామును చూసి ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరిచిన పాము తెలియడంతో చికిత్స చేయడం సులభమైందని వైద్యులు వివరించారు. వెంటనే పామును స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
పాము కాటేసిందని… భార్యతో పాటు పామును ఆస్పత్రికి తీసుకెళ్లి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -