Monday, January 20, 2025

అంగన్‌వాడీ మధ్యాహ్న భోజనంలో పాము కళేబరం

- Advertisement -
- Advertisement -

ముంబయి: అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్న పిల్లలకు మధ్యాహ్నం అందించే భోజనంలో పాము కళేబరం కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పాలస్‌లో జరిగింది. అంగన్‌వాడీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లలకు పప్పు ఖిచిడీతో పాటు ప్రీమిక్స్ ప్యాకెట్లు అందించారు. ప్రీమిక్స్ ప్యాకెట్లు ఓపెన్ చేసి చూడగా పాము కళేబరం కనిపించిందని ఓ చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే అంగన్‌వాడీ టీచర్‌కు చూపించడంతో ఆమె ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. అంగన్‌వాడీ సెంటర్‌లో ఉన్న ప్రీమిక్స్ ప్యాకెట్లను ల్యాబ్ పరీక్షలకు పంపించామని ఆహార భద్రతా కమిటీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News