Sunday, January 19, 2025

మద్యం సీసాలో పాము పిల్ల…

- Advertisement -
- Advertisement -

snake found in liquor bottle in guntur district

అమరావతి: మద్యం సీసాలో చనిపోయిన పామును కొందరు వ్యక్తులు గుర్తించి స్థానికులను భయాందోళనకు గురిచేసిన సంఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరులో చోటుచేసుకుంది. బాపట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. ఈ షాప్ లో కొందరు యువకులు శనివారం రాత్రి మద్యం సీసాలు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి.. మద్యం తాగడం కోసం రెడీ అయిన యువకులు మద్యం సీసాను చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే మద్యం సీసాలో పాము పిల్ల ఆ యువకులకు కనిపించింది. వెంటనే షాప్ దగ్గరకు వెళ్లి యువకులు షాప్ యజమానిని నిలదీశారు. తాము కొన్న మద్యం సీసాకు బదులుగా వేరేది ఇవ్వమని కోరారు. అయితే సిబ్బంది మొదట యువకుల డిమాండ్ ను నిరాకరించారు. దీంతో షాప్ దగ్గర యువకులకు సిబ్బందికి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి షాప్ యాజమాన్యం రాజీకి వచ్చి.. కొత్త మద్యం బాటిల్ ను ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఈ మద్యం సీసాలో పాము పిల్ల న్యూస్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News