Sunday, December 22, 2024

ఉస్మానియాలో బుసలు కొడుతున్న నాగుపాము… విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నాగుపాము కలకలం సృష్టించింది. న్యూ పిజి హాస్టల్ వద్ద బైక్‌లు పార్కింగ్ చేసే స్థలంలో పాము బుసలు కొడుతుండడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. కొందరు విద్యార్థులు అతి దగ్గరి నుంచి వీడియో తీశారు. కొన్ని నెలల కింద పాముకాటుతో ఒయు ఉద్యోగి దుర్మరణం చెందిన విషయం విధితమే. ఉస్మానియాలో యూనివర్సిటీలో చాలా పాములు ఉన్నట్టు విద్యార్థులు అంటున్నారు. ప్రస్తుతం నాగుపాము బుసలు కొడుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. క్యాంపస్ లోపల నుంచి హబ్సిగూడకు పోయే దారిలో పాములు ఎక్కువగా కన్పిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News