Monday, December 23, 2024

స్కూల్ బ్యాగులో నాగుపాము (వీడియో)

- Advertisement -
- Advertisement -

భోపాల్: స్కూల్ బ్యాగులో పాము కనిపించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలో జరిగింది. బదౌనిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తన పుస్తకాల బ్యాగును పాఠశాలకు తీసుకెళ్లింది. తరగతులు ప్రారంభంకాగానే పుస్తకాలు తీయడానికి బ్యాగ్ జిప్‌ను ఓపెన్ చేసింది. ఒక్కసారిగా నాగు పాము బసులు కొట్టడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తరగతి నుంచి పరుగులు తీశారు. స్కూల్ బ్యాగును బయటకు తీసుకెళ్లి జిప్ ఓపెన్ చేసి పామును  ఖాళీ ప్రదేశంలో వదిలిపెట్టారు. ఒక్కసారిగా బ్యాగులో పాము కనిపించడంతో ప్రాణాలు పోయినట్టుగా అనిపించిందిని విద్యార్థిని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News