Wednesday, January 8, 2025

తిరుమలలో నాగుపాము కలకలం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో నాగుపాము కనిపించింది. రింగ్‌రోడ్డు సమీపంలోని బి టైప్ క్వార్టర్స్ 23వ గది వద్ద ఎనిమిది అడుగుల నాగుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారి భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం నాగుపామును అవ్వాచారి కోనలో విడిచి పెట్టాడు. ఎవరికైనా పాములు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పాములను తాము పట్టుకొని అడవిలో విడిచిపెడుతామని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News