Sunday, January 19, 2025

చెప్పులెత్తుకెళ్తున్న వింత పాము… వీడియో చూస్తే షాక్ అవుతారు…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పాముల్లో ఎన్నో రకాలుంటాయి. అందులో విషపూరితమైనవి, విషం లేనివి కూడా ఉంటాయి. కానీ ఓ వింత పాము చేసే పని చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. పాము ఇంటి ముందు చెప్పులెత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. అతను వీడియోను షేర్ చేసి, “ఈ పాము ఆ చెప్పును ఏమి చేస్తుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. పాముకు కాళ్ళు లేవు. తెలియని ప్రదేశం” అని వీడియోకు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఘటన బీహార్ లేదా తూర్పు ఉత్తర్ ప్రదేశ్ జరిగి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వీడియోను వేలాది మంది లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News