Monday, December 23, 2024

ఆకాశంలో విమానం.. పైలట్ సీటు కింద పాము..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విమానం టేకాఫ్ అయిన తర్వాత కాక్ పీట్ లో పైలట్ సీటు కింద త్రాచు పాము కనిపించిన ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.నలుగురు ప్యాసింజర్లతో ఓ విమానం దక్షిణాఫ్రికాలోని వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్ కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ రుడాల్స్ ఎరాస్మస్ కు కాక్ పిట్ లో అలికిడి వినిపించింది. అదేంటో చూడగా తన సీటు కింద పామును గుర్తించాడు. పాము కనిపించిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు తెలపడంతో వారు జోహెన్నెస్ బర్గ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. దీంతో అతను విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడ్డారు.

దీంతో పైలట్ ధైర్యసాహసాలకు అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది అతనిని అభినందించారు. కాగా, విమాన ప్రయాణానికి ముందే వార్సెస్టర్ ఎయిర్ పోర్టు సిబ్బంది విమాన రెక్కల కింద పామును గుర్తించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఎంతకీ పాము ఆచూకీ దొరకలేదు. దీంతో పాము బయటకు వెళ్లిపోయిందని సిబ్బంది అనుకున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పాము మళ్లీ కాక్ పిట్ లో ప్రత్యక్షమైంది. ఇదిలా ఉంటే జోహన్నెస్ బర్గ్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన తర్వాత కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే పాము కనిపించలేదు. దీంతో లాభం లేక ఇంజనీర్స్ పిలిపించి విమాన భాగాలను విప్పి చూసినా లాభం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News