Thursday, November 21, 2024

ఒకే ఇంట్లో ఇద్దరికి పాముకాటు

- Advertisement -
- Advertisement -
snakebite for two in same house in mahabubabad
మూడునెలల పసికందు మృత్యువాత
 ఆసుపత్రిలో తండ్రికి చికిత్స
 కుటుంబాన్ని ఓదార్చిన ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్

మన తెలంగాణ/ మహబూబాబాద్ ప్రతినిధి : ఇంట్లో నిద్రిస్తున్న మూడు నెలల చిన్నారిని పాము కాటు వేయగా నురుగులు కక్కుతూ మృత్యువాత పడిన సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురంలో ఆదివారం చోటు చేసుకుంది. పాప తండ్రి కి కూడా పాము కాటు వేయగా ఆయనకు మానుకోట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. నవమాసాలు మోసి కని అల్లారు ముద్దు గా పెంచుకుంటున్న మూడు నెలల కన్న కూతురిని పాము కాటు వేయగా కన్ను మూసిందనే విషయం తెలుసుకున్న పసికందు తల్లి కళ్లు తిరిగి స్పృహ కోల్పోయిన విషాద ఘటనలు ఒకే ఇంట్లో జరగడం అందరిని కలవర పరిచింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏర్పుల క్రాంతి, మమతలకు మూడు నెలల క్రితం ఆడశిశువుకు జన్మ నిచ్చారు.

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కూతురు ఆస్తమాతో ఇబ్బంది పడుతుండగా ఆమెకు ఖమ్మంలోని ఓ ప్రైవే టు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో నే శనివారం ఖమ్మం ఆసుపత్రిలో పాపకు చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో నిద్రించా రు. అయితే పాప రాత్రి వేళ గుక్కపట్టి ఏడవడంతో దిగ్గున లేచిన పాప తల్లి, తండ్రులు లేచి పాపను ఎత్తుకున్నారు. అయితే పాప నోటి నుంచి నురుగులు రావడంతో ఆమెను ఎత్తుకుని హుటాహుటిన ఆటోలో మానుకోటలోని పిల్లల ఆసుపత్రికి తరలివెళ్లారు. పాప కు దుప్పటి చుట్టి తీసుకెళ్తుతుండగా అందులో నుంచి పాము ఆటోలోనే పడి తండ్రి క్రాంతి కాలుకు కూడా కాటు వేసింది.

ఆసుపత్రిలో పాపను చేర్పించి ఆమెకు చికిత్స అందించే ప్రయత్నం చేస్తుండగా అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యుడు జర్పుల స్వామినాయక్ గుర్తించి వారికి చెప్పారు. తండ్రికి కూడా పాము కాటు వేసిందని తెలుసుకుని ఆయన్ను వెంటనే ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మృతి చెందిన చిన్నారి మృతదేహం వద్ద పాప తల్లి ఏడుపును ఆపడం ఎవరితరం కాలేదు. ఏడుస్తూనే తల్లి మమత కళ్లు తిరిగి స్ప్రృహ కోల్పోయింది. శిశువు మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ శనగపురం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి తండ్రి, కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి రూ.పది వేల ఆర్థిక సాయం అందజేశారు. అస్వస్తతకు గురైన పాప తల్లి మమతను కూడా ఏరియాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News