Wednesday, July 3, 2024

చెలరేగిన స్నేహ్

- Advertisement -
- Advertisement -

కుప్పకూలిన సఫారీలు.. ఫాలో ఆన్
చెన్నై : సొంతగడ్డపై జరుగుతున్న సౌతాఫ్రికా తో జరుగుతున్న ఏకైక టెస్టులో స్పిన్నర్ స్నేహ్ రానా(8/77) సఫారీ విమెన్ బ్యాటర్లను బెంబేలెత్తించింది. సంచలన బౌలింగ్‌తో పర్యాటక జట్టును కుప్పకూల్చింది. స్నేహ్ చెలరేగడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం ఫాలో అన్‌లో పడ్డారు సఫారీలు. రెండో ఇన్నింగ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది.

కాగా.. సునే లస్(109) సెంచరీతో కదం తొక్కగా.. లారా వొల్వార డ్త్(93) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 232 రన్స్ చేసి, 105 పరుగులు వెనకబడి ఉంది. రెండో రోజు భారత విమెన్స్ బ్యాటర్లు భారీ స్కోర్ అందించగా మూడో రోజు బౌలర్లు సయితం బాల్‌తో చెలరేగారు. స్పిన్నర్ స్నేహ్ రానా(8/77) కెరీర్ బెస్ట్ స్పెల్‌తో దక్షిణాఫ్రికా నడ్డి విరిచింది. దాం తో, ఫాల్ ఆన్ ఆడిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదల కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆర్ధ శతకంతో మెరిసిన సునే లస్(109) మరోసారి ఆతిధ్య జట్టును ఆదుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News