Friday, December 20, 2024

ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా స్నేహజ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిగా జొన్నలగడ్డ స్నేహజ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. స్నేహజ 2016 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. స్నేహజ హైదరాబాద్‌కు చెందినవారు. ఆమె చార్టర్డ్ ఆకంటెంట్ కూడా. స్నేహజ అంతకు ముందు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో రెండవ కార్యదర్శిగా పనిచేశారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, మయన్మార్ విభాగంలో ఆమె అండర్ సెక్రటరీగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజిలెన్స్ విభాగంలో కూడా స్నేహజ పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News