Wednesday, January 22, 2025

జమ్ముకశ్మీర్ సోనామార్గ్‌లో హిమపాతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : శ్రీనగర్ లెహ్ జాతీయ రహదారిలోని సోనామార్గ్ ప్రాంతంలో గురువారం భారీ ఎత్తున హిమపాతం సంభవించింది. దీనివల్ల ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సోనామార్గ్‌లో జోజిలా సొరంగం నిర్మాణ ప్రాంతం వర్క్‌షాప్ దగ్గర ఇది సంభవించిందని పేర్కొన్నాయి. కశ్మీర్ లోయలో ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ నెల హిమపాతాలు సంభవించే ప్రమాదం ఉందని, వచ్చే 24 గంటల్లో ఆయా ప్రాంతాలకు రాకపోకలు చేయవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News