- Advertisement -
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో ఆదివారం విపరీతంగా మంచుకురియడంతో శ్రీనగర్ విమానాశ్రయం మీదుగా సాగే విమాన సర్వీస్‌లకు అంతరాయం కలిగింది.శనివారం రాత్రి ప్రారంభమైన హిమపాతం ఆదివారం ఉదయం కాస్త ఆగినా, మళ్లీ విపరీతంగా కురియడంతో అన్ని విమానసర్వీస్‌లను రద్దు చేసినట్టు విమానాశ్రయం అధికారులు తెలిపారు. ముంబైకి చెందిన ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో తమ ఆరు విమాన సర్వీస్‌ల్లో నాలుగు శ్రీనగర్‌కు, రెండు లెహ్‌కు రద్దయినట్టు తెలియజేసింది. వాతావరణంలో అసాధారణ మార్పు రావడంతో శ్రీనగర్, లెహ్ రన్‌వేలు మూసివేయడంతో విమానసర్వీస్‌లు రద్దుకు దారి తీశాయని ప్రకటించింది. రోడ్లపై ట్రాఫిక్ సాగడానికి వీలుగా ఉదయం నుంచి మంచు తొలగించే పనులు చేపట్టారు.
- Advertisement -