- Advertisement -
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ పట్టణం సోమవారం దట్టమైన మంచు దుప్పటిని కప్పుకుంది. సాధారణ జీవనంపై మంచు ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. ఎదురుగా ఉన్న దృశ్యాలు సరిగా కనిపించక వాహనాలు చాలా మెల్లగా సాగాయి. సోమవారం ఉదయం 8.30 గంటలకు మంచు కమ్ముకోవడం వల్ల దృశ్యమాన్యత 91 మీటర్ల వరకే వీలవుతుండడంతో , మోటారిస్టులు చాలా జాగ్రత్తగా వాహనాలను నడపాలని స్థానిక వాతావరణ కార్యాలయ అధికారి సూచించారు. ఢిల్లీ నుంచి రావలసిన విమానాలు కొన్ని ఆలస్యం అవుతున్నాయని, శ్రీనగర్ విమానాశ్రయ అధికారి చెప్పారు.
- Advertisement -