- Advertisement -
వాషింగ్టన్: అమెరికాలో మంచుతుపాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో రహదారులపై భారీగా మంచు కురిసింది. మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. హిమపాతం పెరిగే అవకాశముందని అమెరికా వాతావరణ విభాగం పేర్కొంది. తుపాను కారణంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మంచుతుపాను ధాటికి దేశవ్యాప్తంగా 4 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
- Advertisement -