Monday, December 23, 2024

సమస్యల వలయంగా మారిన సికింద్రాబాద్ రైతిఫిల్ బస్టేషన్

- Advertisement -
- Advertisement -

బస్‌పాస్ కావాలంటే
వృద్దులైన,వికలాంగులైన మెట్లు ఎక్కాల్సిందే
కాగితాలకే పరిమితమైన ప్రత్యేక కౌంటర్

So Many Problems in Rethifile bus station
మన తెలంగాణ,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని రైతిఫిల్ బస్టేషన్ సమస్యలకు చిరునామాగా మారింది. నష్టాల్లో ఉన్న ఆర్‌టిసికి ఆదాయం రావాలంటే ప్రయాణికులు ముఖ్యవనరుంటున్న అధికారులు వారిని ఆదాయ వనరుగా చూస్తున్నారే కాని వారి సమస్యలను ఏ మాత్రం పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని రేతిఫిల్ బస్‌పాస్ కౌంటర్ల వద్ద వారు ప్రయాణికులు కష్టాలు చెప్పనలవి కాదు. అధికారులు ప్రయాణికులకు ఇక్కడ నుంచి సుమారు 30 రకాల బస్‌పాస్‌లను అందిస్తున్నారు. వారిలో విద్యార్థులు, ఇతర సాధారణ ప్రయాణికులతో పాటు వృద్దులు ,వికలాంగులు కూడా ఉన్నారు. బస్‌పాస్ కౌంటర్ రెండో అంతస్తులో ఉండటం ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం లేక పోవడంతో వృద్దులు,వికలాంగులు బస్‌పాస్‌లను తీసుకోవాలంటే రెండో అంతస్తులో ఉన్న బస్‌పాస్ కౌంటర్ సుమారు 60కిపైగా ఉన్న మెట్లను ఎక్కి బస్‌పాస్ కౌంటర్‌కు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వారు మెట్లపై మీద నుంచి జారీ పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో మెట్రో రైల్వేస్టేషన్ లేక ముందు కేవలం ప్రయాణికులు బస్‌పాస్ కోసం వచ్చేవారు మాత్రమే ఉండేవారు కానీ మెట్రో స్టేషన్‌కు రేతిఫిల్ బస్టేషన్‌ను కూడా లింక్ చేయడం , దాంతో మెట్రో ప్రయాణికులు సైతం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.దీంతో మెట్రో ప్రయాణికులు కూడా అదే బస్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుండటం, రైతిఫిల్ బస్టేషన్ మెట్లు చిన్నగా ఉండటంతో రద్దీ అధికమైంది. ఒక వైపు మెట్రోప్రయాణికులు , మరో వైపు బస్‌పాస్‌ల కోసం వచ్చే ప్రయాణికులతో ఆ మార్గం పూర్తిగా రద్దీగా మారిడంతో బస్‌పాస్‌ల కోసం వచ్చే విద్యార్థులతో పాటు వృద్దులు, వికలాంగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధిక మించాలంటే అక్కడ లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా కానీ బస్‌పాస్ కౌంటర్‌ను అక్కడ నుంచి పూర్తిగా తొలగించడం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

అటకెక్కిన ప్రత్యేక కౌంటర్ ప్రతిపాదన: గతంలో అధికారులు వృద్దులకు, వికలాంగుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా బస్‌పాస్ కౌంటర్‌ను కిందనే ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో సమస్య అదే విధంగా ఉంది. ఇకనైనా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి వారి కోసం ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News