Tuesday, December 24, 2024

ఆర్‌బిఐకి సవాలుగా మారిన ఇళ్ల ధరలు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ఇంటి ధరలు, అద్దెలు భారత రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణ పోరాటానికి సవాలు విసురుతున్నాయి. వినియోగ ధరలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. భారత వినియోగధరల ద్రవ్యోల్బణంలో అద్దెలు, అనుషంగీకాలు 10.07 శాతంగా ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ఆహార పదార్థాలకు తోడు పెరుగుతున్న అద్దెలు, ఇంటి ధరలను అదుపుచేయడం ఆర్‌బిఐకి సవాలుగా మారింది. అందరికీ గృహ వసతి అన్నది అందని చందమామలా తయారయింది.

పట్టణ ప్రాంతంలో హౌసింగ్ ఇన్‌ఫ్లేషన్ 2022 డిసెంబర్ నాటికి 4.47 శాతం పెరిగింది. ఇది 2020లో 3.21 శాతంగా ఉండింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022లో ఇంటి అద్దెలు 20 శాతం నుంచి 25 శాతం మేరకు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఇంటి ధరలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సగటున 4 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగాయి. మరి కొన్ని ఏళ్లలో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగనున్నాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News